షకలక శంకర్‌కి పవన్ కళ్యాణ్ వార్నింగ్...!
on Jul 12, 2018
కొన్నాళ్ల క్రితం షకలక శంకర్ అంటే కేవలం రామ్‌గోపాల్‌వర్మని అనుకరించే ఓ చిన్న నటుడిగానే అందరికీ తెలుసు. క్రమంతా జబర్దస్త్‌తో కమేడియన్ అన్న గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపుతోనే కొన్ని సినిమాల్లోనూ ఛాన్స్ కొట్టేశాడు. తాజాగా ‘శంభో శంకర’తో హీరోగానూ స్థిరపడ్డాడు. శంభో శంకర హిట్ అని చిత్ర యూనిట్ చెప్పుకొన్నా, అది బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ సినిమాగానే నిలిచిపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే... శంకర్ తాజాగా ఓ గత అనుభవం గురించి ఏదో మీటింగ్‌లో చెప్పుకొచ్చాడు.
సర్దార్ గబ్బర్‌సింగ్‌లో శంకర్ నటించిన విషయం తెలసిందే! ఆ సినిమా షూటింగ్ సందర్భంగా రీల్ మరీ ఎక్కువ ఖర్చవుతోందనీ, దానివల్ల నిర్మాత పవన్ కళ్యాణ్‌కు డబ్బులు వృధా అయిపోతున్నాయని తెగ ఫీల్ అయిపోయాడట శంకర్. దాంతో అక్కడి అసిస్టెంట్ డైరక్టర్ని పలిచి ఓ క్లాస్ పీకాడట. విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ `అప్పుడే డైరెక్టర్లను, కో-డైరెక్టర్లను తిట్టే రేంజ్‌కు వచ్చావా. వాళ్లు ఎన్ని సార్లు తీస్తే నీకెందుకు? ఎంత డబ్బు పెడితే నీకెందుకు? నీ లిమిట్స్‌లో నువ్వుండు, నీ పని చేసుకుని నువ్వు వెళ్లిపో,’ అంటూ శంకర్‌ను పిలిపించి వాయించేశాడట.