పవన్ స్టార్ ఇక వీధి రౌడి!
on Jan 17, 2018
‘అజ్ఙాతవాసి’ తర్వాత పవర్ స్టార్ సినిమా ఏంటి? ఆయన సినిమా చేస్తారా? లేక రాజకీయాల్లో బిజీ అయిపోతారా? పవన్ కల్యాణ్ భవిష్యత్ ప్రణాళికలేంటి? ఇవన్నీ అభిమానుల్లో వెంటాడుతున్న ప్రశ్నలు. వాటికి సమాధానంగా నెక్ట్స్ ప్రాజెక్ట్ లైన్లోకి వచ్చేస్తోంది. అజిత్ తమిళంలో నటించిన సూపర్ హిట్ ‘వేదాళం’ తెలుగు రీమేక్ లో పవర్ స్టార్ నటించనన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యింది. ఏ.ఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు ఆర్.టి.నీసన్ దర్శకుడు. ఇతను విజయ్ ‘జిల్లా’ దర్శకుడు. ‘అజ్ఙాతవాసి’ సినిమా కారణంగా డీలా పడ్డ అభిమానులకు ‘వేదాళం’ తెలుగు రీమేక్ గొప్ప అనుభూతినే ఇవ్వనుందని చెప్పక తప్పదు. ఎందుకంటే... ‘వేదాళం’లో అజిత్ కేరక్టరైజేషన్ అలా ఉంటుంది మరి. అందులో అజిత్ ది ఊర మాస్ పాత్ర. వీధి గూండా. తాను చేసిన తప్పు కారణంగా.. ఓ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. ఓ అమ్మాయి అనాధగా నిలిచిపోతుంది.
ఆ అమ్మాయి కోసం తన ప్రవర్తన మార్చుకొని మంచివాడిగా మారి... ఆ అమ్మాయిని తీసుకొని ముంబాయ్ లో బతుకుతుంటాడు. ఆ తర్వాత...జరిగిన కొన్ని పరిణామాలు మళ్లీ.. అతడ్ని రాక్షసుడ్ని చేస్తాయ్. తమిళ దర్శకుడు శివ ఈ చిత్రాన్ని ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించేలా తీశాడు. ఇంట్రవెల్ బ్యాంగ్ అయితే.. రోమాలు నిక్కబొడుసుకునే స్థాయిలో ఉంటుంది. మరి ఆ పాత్రను పవన్ చేస్తే.. దాని ఇంపాక్ట్ ఇంకాస్త ఎక్కువే ఉంటుందని చెప్పక తప్పదు. పవన్ ఇప్పటి వరకూ చేసిన మాస్ సినిమాల కంటే.. పదింతలు ఎక్కవ మాస్ గా ‘వేదాళం’ రీమేక్ ఉంటుందని టాక్. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. అభిమానులూ... ‘అజ్ఙాతవాసి’ ని ఇక మరిచిపోండి. ‘వేదాళం’ తెలుగు రీమేక్ కోసం వేచి ఉండండి.. రికార్డులు బద్దలవ్వడం ఖాయం.