ఈ నెల తెలుగువన్ షార్ట్ ఫిల్మ్ విజేత 'PK-2'
on Feb 26, 2015
తెలుగువన్ గత కొంతకాలంగా అనేకమంది యువతీయువకులకు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పేరుతో ఓ అద్భుతమైన వేదికను ఏర్పాటు చేసి, ప్రతి నెలా ఉత్తమ షార్ట్ ఫిలిం దర్శకుడికి పదివేల రూపాయల నగదు బహుమతి అందిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా తెలుగువన్ అందించిన షార్ట్ ఫిలిం అవకాశం మెట్టు ఎక్కిన చాలామంది తమ ప్రతిభతో మరిన్ని మెట్లు ఎక్కి సినిమా రంగానికి చేరువయ్యారు కూడా. 16 జనవరి నుంచి 15 ఫిబ్రవరి వరకు తెలుగువన్ ప్రోత్సాహంతో రూపొందించిన షార్ట్ ఫిలిమ్స్ లో 'PK-2' షార్ట్ ఫిల్మ్ ఉత్తమ షార్ట్ ఫిల్మ్౦గా ఎంపికయింది. ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందించిన శ్రీకాంత్ రెడ్డి ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు.త్వరలో శ్రీకాంత్ రెడ్డి పదివేల రూపాయల నగదు బహుమతిని అందుకోబోతున్నారు.