నాకు హిట్టులూ, ఫ్లాపులూ వద్దూ..ఎన్టీఆర్
on Jan 29, 2015
ఎన్టీఆర్ టెంపర్ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో చాలా పరిణితిగా మాట్లాడటమే కాదు అబిమానులకు నచ్చేలామాట్లాడాడు. ఈ ఆడియో ఫంక్షన్ అతన్ని మాటల్ని గమనిస్తే తన గత చిత్రాల నుంచి చాలా నేర్చుకున్నట్లు కనిపిస్తోంది. “కట్టుకున్న భార్యను ఎంత బంగారంగా చూసుకోవాలో, బిడ్డని ఎంత ఆప్యాయంగా చూసుకోవాలో, అభిమానులను కూడా అలాగే చూసుకోవాలి… ఈరోజు ఒంటి మీద ఈ చొక్కా, ప్యాంటు వేసుకుని ఈ వేదికపై నిలబడ్డానంటే అది అభిమానుల పెట్టిన బిక్షే. నేను హిట్లు, ఫ్లాపుల గురించి ఆలోచించడం మానేశాను. చేస్తూ పోతా, సినిమాలు చేస్తూ పోతా. నాకు ఊపిరి ఉన్నంతవరకు సినిమాలు చేస్తూ పోతా. మీరు ఆనంద పడే వరకు సినిమాలు చేస్తూ పోతా. మీరు గర్వపడే వరకు సినిమాలు చేస్తాను. ప్రతి సినిమాకు కష్టపడి పనిచేశాను. కానీ ఈ సినిమాను కసితో చేశాను. నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చకపోయినా పర్లేదు. మీకు నచ్చే వరకు సినిమాలు చేస్తూ ఉంటాను. ఇది నందమూరి నామ సంవత్సరం కావాలి. “పటాస్”లాగే టెంపర్, లయన్ సినిమాలు భారీ విజయాలను అందుకోవాలి. అందుకు అభిమానులతో తాత గారి ఆశీస్సులు కూడా కావాలి. నాకు అన్నయ్య జానకిరామ్ ఎంతో మీరూ అంతే. మీరు రక్తం పంచుకుని పుట్టకపోయినా, నాక మీరందరూ తోబుట్టువులే. దయచేసి ఇంటికి క్షేమంగా వెళ్లండి”అంటూ ఎన్టీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.