ఈ రెండు సినిమాల కాపీయే నిన్ను కోరి
on Jun 17, 2017
సినిమా ఎలా ఉన్న మినిమం గారంటీ ఉన్న హీరో నాని. కానీ ఎందుకో కథలు ఎంచుకునే విషయంలో ఈ మధ్య కాలంలో పొరపాట్లు చేస్తున్నాడు. ఈ సారి హిట్ కొట్టకపోతే నాని తదుపరి చిత్రాల మార్కెట్ దెబ్బతినే అవకాశం ఉంది. ఆది, నివేద థామస్ సహ నటులుగా చేస్తున్న నిన్ను కోరి మీద గంపెడు ఆశలు పెట్టుకున్నాడు నాని. మొన్నటి వరకు సినిమా మీద మంచి అభిప్రాయమే ఉన్నా, ఈ రోజు విడుదలయిన ట్రైలర్ ఎందుకో సో సో గా ఉండడంతో సినిమా పై డౌట్స్ మొదలయ్యాయి. ఈ సినిమాకి అచ్చు ఈవీవీ సినిమా కన్యాదానం, హిందీ హిట్ సినిమా హమ్ దిల్ దే చుకే సనమ్ పోలికలున్నాయి.
నాని తాను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి వేరే ఇంకొకరి ప్రేమలో ఉండడం... ముగ్గురి మధ్య సంఘర్షణ... ఇవే ప్రధాన అంశాలుగా కనిపిస్తున్నాయి. నాని మార్క్ కామెడీ కూడా ట్రైలర్ లో కనిపించలేదు. నానిని ఇలాంటి క్యారెక్టర్ లో ఆడియన్స్ ఎంత వరకు అంగీకరిస్తారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇవన్నీ పక్కన పెడితే, ట్రైలర్ చివర్లో గెడ్డంతో కనపడి నాని పెద్ద షాకే ఇచ్చాడు. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నిన్ను కోరి బడ్జెట్ అనుకున్నదాని కన్నా చాలా ఎక్కువ అయిందని... బిజినెస్ అంత చేయడం కష్టం అని అంటున్నారు... చూద్దాం ప్రేక్షకులు నిన్ను కోరి ని ఎలా రిసీవ్ చేసుకుంటారో!