ట్రైలర్ రివ్యూ : నిన్ను కోరి
on Jun 17, 2017
కొత్త దర్శకుల్ని పట్టుకొని... వాళ్ల నుంచి తనకు కావల్సింది రాబట్టుకోవడంలో దిట్ట అయిపోయాడు నాని. ఈమధ్య కాలంలో నాని విజయాలు అందుకొన్న చిత్రాలన్నీ దాదాపుగా కొత్త దర్శకులతో చేసినవే. మరోసారి శివ నీర్వాణని దర్శకుడదిగా పరిచయం చేస్తున్నాడు `నిన్ను కోరి` సినిమాతో. నివేధా ధామస్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇప్పుడు ట్రైలర్ విడుదల చేశారు. మరోసారి.. ట్రైలర్ ఫ్రెష్ లుక్‌తో సాగింది. నాని డైలాగులు, గోపీ సుందర్ సంగీతం, కెమెరా వర్క్, ఎమోషన్స్ ఇవన్నీ.... పక్కాగా పండినట్టు కనిపిస్తోంది. ఓ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని... నాని మార్క్ కామెడీ టైమింగ్ తో మిక్స్ చేసినట్టు అనిపిస్తోంది. చివర్లో. `నీకు అర్థం అవుతోందా... నా గెలుపు ఆల్రెడీ మొదలైపోయింది` అన్నచోట నాని లుక్ చూస్తే షాక్ ఇవ్వడం ఖాయం. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా.. నాని ఖాతాలో మరో సూపర్ హిట్‌ని చేరుస్తుందన్న భరోసా కలిగించింది నిన్ను కోరి ట్రైలర్.