టిక్‌టాక్‌కి టాలీవుడ్ హీరో సపోర్ట్
on Jun 30, 2020
ఒకవైపు గ్వాలన్ సరిహద్దుల దగ్గర భారత సైన్యంతో దాడికి దిగుతూ ఘర్షణపూర్తిత వాతావరణం సృష్టించిన చైనా, మరోవైపు చర్చల పేరుతో నాటకాలు ఆడుతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో సైనిక విమానాన్ని సిద్ధంగా ఉంచింది. చైనా ద్వందవైఖరి గమనించిన భారత ప్రభుత్వం, దేశ ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తున్న 54 యాప్స్ మీద నిషేధం విధించింది. అందులో టిక్‌టాక్, హలో వంటివి ఉన్నాయి. టిక్‌టాక్ యాప్ నిషేధంపై టాలీవు హీరోలు నిఖిల్, సందీప్ కిషన్ మధ్య ట్విట్టర్లో డిస్కషన్ నడిచింది.
"వాళ్ళు మన దేశానికి గౌరవం ఇస్తున్నంత వరకూ టిక్‌టాక్‌ని బ్యాన్ చేయకుండా ఉండాల్సింది. ఇది మన జీవితం. ప్రజాస్వామ్యం" అని నిఖిల్ ట్వీట్ చేశారు. దీనికి బదులుగా సందీప్ కిషన్ "జనవరిలో టిక్ టాక్ కంపెనీ విలువ 75 బిలియన్ డాలర్లుగా నిర్ణయించారు. చైనాలోని టాప్ టాక్స్ పేయర్లలో టిక్ టాక్ కంపెనీ ఒకటి. మనపై ఎటాక్ చేస్తున్న దేశానికి మనమే ఫండ్స్ అందిస్తున్నాం. టిక్ టాక్ కూల్ యాప్. ఇండియాని కోల్పోవడం వాళ్ల దురదృష్టం" అని వివరించారు. "నా పాయింట్ కూడా అదే. ట్వీట్ మళ్లీ చదువు. అందులో ఎటకారాన్ని మిస్ అయ్యావ్" అని నిఖిల్ వివరించారు.