ధనలక్ష్మి కత్తెరకు ఆత్మహత్య ప్రయత్నం
on Feb 27, 2014
సెన్సార్ బోర్డు సభ్యురాలు ధనలక్ష్మీపై రోజు రోజుకు ఫిర్యాదులు ఎక్కువైపోతున్నాయి. తాజాగా ఈ అమ్మగారి నిర్వాకానికి ఆత్మహత్య యత్నం చేసాడు ఓ నిర్మాత. తను నిర్మించిన "అమ్మనాన్న ఊరెళితే" అనే సినిమాలో దాదాపు 40 కత్తెరలు పడ్డాయంట. ఆమె కట్ చేయమన్న విషయాలు సినిమాలో లేకపోతే అసలు అది సినిమా అవదని, అవి ఖచ్చితంగా ఉండాలని, అవెం బూతులు కాదని సెన్సార్ సభ్యులను ఆ చిత్ర నిర్మాత ఆశ్రయిస్తే తన మాట ఎవరు పట్టించుకోకపోవడంతో అక్కడే నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే వెంటనే స్పందించిన అక్కడి వారు దగ్గరలోని హాస్పిటల్ కు తీసుకెళ్లడంతో ప్రస్తుతం ఆ నిర్మాత సేఫ్ గా ఉన్నట్లు తెలిసింది.