నేలటిక్కెట్టు నిర్మాతను గట్టెక్కిస్తోన్న హీరో!!
on Sep 12, 2018
హీరోని నమ్మి భారీ బడ్జెట్ తో సినిమా నిర్మించి...ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోతే... ఆ నిర్మాత నష్టాల ఊబిలో కూరుకుపోయినప్పుడు వారికి వెంటనే సినిమా ఇచ్చి ఆ నిర్మాతను ఆదుకునే ప్రయత్నం కొంత మంది హీరోలు చేస్తుంటారు. ఆ కోవలో ఇప్పుడు రవితేజ్ నిర్మాత రామ్ తాళ్లూరికి సినిమా ఇచ్చి చేయూతనిచ్చే ప్రయత్నం చేస్తున్నాడట. రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించిన చిత్రం `నేల టిక్కెట్టు`. ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఎన్నో కోట్లు పెట్టిన నిర్మాతకు విపరీతమైన నష్టాలు మిగిల్చడంతో ఆ నిర్మాత కోలుకోని పరిస్థితి. ఈ సమయంలో రవితేజ మరో సినిమా చేయడానికి రామ్ తాళ్లూరికి డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఎక్కడికిపోతావు చిన్నవాడ, ఒక్క క్షణం చిత్రాలతో తాజాగా సక్సెస్ అందుకున్న విఐ ఆనంద్ ఇటీవల ఒక కథ రవితజే కు వినిపించాడట. లైన్ నచ్చడంతో రవితేజ ఓకే చేసినట్టు సమాచారం. దీనికి రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి. అలాగే ఈ బేనర్ లో మరో చిన్న సినిమా కూడా రూపొందనుంది. దీనికి విద్యాసాగర్ దర్శకత్వం వహించనున్నారు. జగపతిబాబు ప్రధాన పాత్ర పోషించనున్నారు.