English | Telugu

బంగార్రాజుతో న‌య‌న‌తార!!

on Apr 4, 2019

 

2016లో నాగార్జున  న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం `సోగ్గాడే చిన్నినాయ‌నా`. క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం లో నాగార్జున ద్విపాత్రాభిన‌యం చేశాడు. అయితే ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ గా `బంగార్రాజు చిత్రం రానుంది. ప‌ల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో రానున్న  ఈ సినిమాలో బంగార్రాజు స‌ర‌స‌న న‌య‌న‌తార నటించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల ఆమెను సంప్ర‌దించ‌గా ఆమె త‌న పాత్ర‌కు ఇంప్రెస్ అయి వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

నాగార్జున ప్ర‌జంట్ `మ‌న్మథుడు2` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే షూటింగ్ ప్రారంభించుకున్న  ఈసినిమా షూటింగ్ పూర్తైన వెంట‌నే బంగార్రాజు షూటింగ్ లో పాల్గొంటాడు నాగార్జున‌. అన్న‌పూర్ణ స్టూడియోస్ ప‌తాకంపై క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో జూలైలో ప్రారంభం కానుందీ సినిమా.  నాగ్ స‌ర‌స‌న న‌య‌న‌తార న‌టిస్తే 'వాసి వాడి తస్సాదియ్యా' అనాల్సిందే అంతా.


Cinema Galleries



Latest News


Video-Gossips