గెడ్డంతో నయన రొమాన్స్
on Mar 4, 2015
తెలుగులో ఫ్లాప్ హీరోగా.. ఫ్లాప్ డైరెక్టర్గా కీర్తి తెచ్చుకొన్నాడు జేడీ చక్రవర్తి. హిందీలోనూ కొన్ని ప్రయత్నాలు చేశాడుగానీ వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడు మలయాళంలోకి వాలాడు. అక్కడో సినిమా చేస్తున్నాడు. అది అల్లాటప్పా సినిమా కాదు. అందులో హీరోయిన్ ఎవరునుకొంటున్నారు...??? నయనతార. సిద్దిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలతో జెడీ - నయన జంటగా నటిస్తున్నారు. ఊహించని ఆఫర్ రావడంతో జేడీ ఉబ్బితబ్బుబ్బి అవుతున్నాడు. అన్నట్టు ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. అన్నట్టు జెడి - నయన ఇది వరకు దుబాయ్ శీనులో కలసి నటించారు. అన్నాచెల్లెళ్లుగా. ఈసారి జోడీ కట్టేశారు. సినిమా అంటే అంతే. ఇలాంటి చిత్రవిచిత్రాలు జరుగుతూనే ఉంటాయ్. మొత్తానికి ఓ బంపర్ ఆఫర్ కొట్టేశాడు జేడీ.