బాలయ్యతో మూడోసారి రొమాన్స్
on Jan 24, 2015
సింహ, శ్రీరామరాజ్యం వంటి సూపర్ హిట్ చిత్రాలలో బాలయ్య సరసన నటించిన నయనతార ముచ్చటగా మూడోసారి ఆయనతో జత కట్టబోతోంది. బాలయ్య 99వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న శ్రీవాస్ ఈ చిత్రంలో కథానాయికగా నయనతారను ఎంచుకున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి గోపీమోహన్, కోనవెంకట్ రచయితలుగా పనిచేస్తుండగా, థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య 'లయన్' సినిమా షూటింగ్ లో బిజీగా వున్నారు. ఆ సినిమా తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.