నయనతార లవర్ బర్త్ డే కూడా అక్కడే....
on Sep 18, 2020
టాలీవుడ్... కోలీవుడ్... బాలీవుడ్... ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని సినిమా ఇండస్ట్రీలలో ఒక కదలిక వస్తోంది. చాలామంది సినిమా షూటింగులు స్టార్ట్ చేస్తున్నారు. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే కొత్త సినిమా కబుర్లు, షూటింగులు మొదలుపెట్టామనే మాటలు వినిపిస్తున్నాయి.
స్టార్ హీరోయిన్ నయనతార, తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ ఇప్పటిలో సినిమా కబుర్లు చెప్పేలా లేరు. ప్రస్తుతానికి వాళ్ళిద్దరు గోవాలో ఎంజాయ్ చేయడంలో బిజీగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం నయనతార, విగ్నేష్ శివన్ కేరళ వెళ్లారు. అక్కడినుండి నయనతార తల్లితో కలిసి గోవా వెళ్లారు.
గోవాలో నయనతార తల్లి పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. అంతే కాదు.... ఇప్పుడు విగ్నేష్ శివన్ పుట్టిన రోజును కూడా అక్కడే సెలబ్రేట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 18... అనగా ఈ రోజు అతడి పుట్టినరోజు. గోవాలో ప్రేయసితో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడు.
Also Read