త్వరలోనే నాని దొంగతనాలు...!
on Jun 8, 2018
నాని.. ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. స్వతహాగా సినిమాల్లోకి వచ్చి.. తన నేచురల్ లుక్స్, నేచురల్ యాక్టింగ్ తో త్వరగానే ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.. అయితే ఈ మధ్య తన సినిమాలు రొటీన్ గా ఉంటున్నాయని విమర్శలు వస్తుండటంతో.. నాని తన రూట్ మార్చినట్టు తెలుస్తుంది.. నాని త్వరలో ఒక బయోపిక్‌లో నటించబోతున్నాడట.. ఆ బయోపిక్ ఎవరిదో తెలిస్తే షాక్ అవుతారు.. 1970 టైములో ఆంధ్రప్రదేశ్‌లో వరుస బ్యాంకు దొంగతనాలతో హడలెత్తించిన స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు కథని సినిమాగా తీయాలని 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' సినిమా దర్శకుడు వంశీ కృష్ణ ప్లాన్ చేస్తున్నాడట.. ఈ సినిమాలో గజదొంగ నాగేశ్వరరావు పాత్రలో దగ్గుబాటి రానా నటిస్తున్నాడు అనే వార్తలు గతంలో వచ్చాయి కానీ... ఇప్పుడు మాత్రం నాని నటించబోతున్నట్టు ఫిల్మ్‌నగర్ టాక్.. ఈ వార్త నిజమైతే త్వరలోనే నాని దొంగతనాలు వెండితెర మీద చూస్తాం.