ఆమెతో కలిసి నిర్మాతగా నాని మరో సినిమా!!
on Apr 23, 2019
ప్రస్తుతం నాని ప్రశంసల జల్లుల్లో తడిసి ముద్దవుతున్నాడు. జెర్సీ సినిమా విజయోత్సహంలో మునిగి తేలుతున్నాడు. ఈ ఉత్సాహంతో నాని నిర్మాతగా మరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో `అ` సినిమా నిర్మించి విమర్శకులు ప్రశంసలందుకున్నాడు. తన రెండో సినిమాను వైజయంతి మూవీస్ అశ్వనీదత్ కూతురు స్వప్నదత్ తో కలిసి ఒక కామెడీ ఎంటర్ టైనర్ చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.
గతంలో `పిట్టగోడ` చేసిన దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందట. ఇందులో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి , షాలిని పాండే ముఖ్య తారాగణంగా ఉంటారట. ఈ సినిమా అంతా కూడా ఈ మూడు పాత్రల చుట్టూరా తిరుగుతుందట. ఇటీవల రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కలిసి ఒక కామెడీ సినిమాతో వచ్చారు. అలాగే పలు చిత్రాల్లో కమెడియన్స్ గా అలరిస్తున్నారు. ఇక అర్జున్ రెడ్డితో అలరించిన షాలిని ఇటీవల 118 చిత్రంతో సక్సెస్ అందుకుంది. ఇలా ప్రతిభావంతులైన నటీనటులతో రూపొందనున్న ఈ సినిమా గురించి త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.