నానీ... నువ్వు లవర్ ఆల్సో! రైటర్ ఆల్సో!!
on Nov 24, 2020
నాచురల్ స్టార్ నానిలో లవర్ ఉన్నాడని అంటున్నారు ఆయన సతీమణి అంజన యలవర్తి. అలాగే, నానిలో రైటర్ కూడా ఉన్నాడని ఆమె అంటున్నారు. 'నువ్వు లవర్ ఆల్సో! రైటర్ ఆల్సో!!' అని అంజనా కామెంట్ చేశారు. శ్రీమతికి ప్రేమతో ఇంస్టాగ్రామ్ లో నాని పుట్టినరోజు శుభాకాంక్షలు చెబితే... ఆమె భర్తను లవరు, రైటరు అని ప్రశంసించారు. అసలు నాని చెప్పిన శుభాకాంక్షలు ఏమిటి? అంటే....
కుమారుడు అర్జున్, శ్రీమతి అంజనాతో కలిసి నాని విమాన ప్రయాణం చేస్తుండగా నిద్రపోతున్న సమయంలో సన్నిహితులు ఎవరో ఈ ముగ్గురినీ ఫోటో తీశారు. దానిని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన నాని "హ్యాపీ బర్త్ డే అంజు. ఇది చాలా సుదీర్ఘమైన విమాన ప్రయాణం (జీవిత ప్రయాణాన్ని ఉద్దేశిస్తూ). నీకు ఇరు వైపులా మంచి కంపెనీ ఉంది (నీకు తోడుగా మంచి వ్యక్తులు ఉన్నారు అన్నట్లు)" అని రాశారు. దానికి అంజన కామెంట్ చేశారు.