నాని సినిమాలో నితిన్ హీరోయిన్?
on Jan 18, 2019
'ఇష్క్', 'మనం', '24' సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాలో హీరోయిన్గా మేఘా ఆకాష్‌ని తీసుకోవాలని దర్శకుడు భావిస్తున్నారట! నితిన్ 'లై', 'చల్ మోహన్ రంగ' సినిమాల్లో హీరోయిన్గా నటించిన అమ్మాయే మేఘా ఆకాష్. ఇటీవల విడుదలైన రజనీకాంత్ 'పేట'లో సిమ్రాన్ కుమార్తెగా రెండు మూడు సన్నివేశాలలో కనిపించింది. తెలుగులో హీరోయిన్గా నటించిన రెండు సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఆమెకు మరిన్ని అవకాశాలు రాలేదు. తమిళంలో సినిమాలు చేస్తుంది. ఒకవేళ నాని, విక్రమ్ కుమార్ సినిమాలో ఆమెకు అవకాశం వస్తే... ఆ సినిమా విజయం సాధిస్తే... ఆ తరవాత తెలుగులో మేఘా ఆకాష్ రాత మారుతుందేమో చూడాలి. ప్రస్తుతానికి సినిమాలో మేఘా ఆకాష్ నటించేది ఖరారు కాలేదు. డేట్స్, రెమ్యునరేషన్ విషయాలు మాట్లాడుకుంటున్నారట. రెండు మూడు వారాల్లో ఓ స్పష్టత వస్తుంది.