చైనాలోనూ నాని 'జెర్సీ'
on Apr 9, 2019
'జెర్సీ'లో క్రికెట్ మాత్రమే కాదు... అంతకు మించి పెద్ద సర్ ప్రైజ్ ఉందని నాని చెబుతున్నాడు. టైటిల్, టీజర్ చూసి క్రికెట్ బేస్డ్ సినిమా అనుకోవద్దని... క్రికెట్ ని మించిన ఎమోషన్ సినిమాలో ఉందని అన్నాడు. నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన సినిమా 'జెర్సీ'. ఈ నెల 19న సినిమా విడుదల కానుంది. అంతకుముందు 12న థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసి, 15న ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నారు. సినిమా 19న విడుదల కాదని, వాయిదా పడుతుందని వస్తున్న వార్తలను నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఖండించారు. సినిమా అవుట్ పుట్ బాగా వచ్చిందని, తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త జానర్ ఓపెన్ చేస్తున్నామనే కాన్ఫిడెన్ తో ఉన్నామని ఆయన అన్నారు. సినిమా కోసం క్రికెట్ ప్రాక్టీస్ చేశానని, క్లైమాక్స్ మ్యాచ్ 14 రోజులు షూట్ చేశామని, ఈ సినిమా ద్వారా క్రికెటర్ల కష్టం తెలిసిందని నాని అన్నారు. సినిమాను చైనాలోనూ విడుదల చేయాలని ఉందని ఆయన తెలిపారు.