టబు స్థానంలో నందిత దాస్
on Aug 10, 2019
చాలా గ్యాప్ తర్వాత టబు.. తెలుగు సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఒక షెడ్యూల్ లో కూడా పాల్గొన్నది . ఇదిలా ఉంటే ... రానా, సాయి పల్లవి జంటగా రూపొందుతున్న `విరాటపర్వం ` సినిమా లో కూడా ఒక క్యారక్టర్ కోసం టబుని తీసుకున్నట్లు న్యూస్ వచ్చాయి . అయితే పలు సినిమాల తో బిజిగా ఉన్న టబు `విరాటపర్వం ` నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం. ఇక ఆమె ప్లేస్ లో బాలీవుడ్ నటి నందిత దాస్ ని తీసుకుంటున్నారట. అయితే ఇంత వరకు అధికారికంగా దర్శక , నిర్మాతలు ఎవరూ స్పందించలేదు. అయితే తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలతో బిజీ గా ఉండడం వల్లే టబు `విరాటపర్వం ` నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.