English | Telugu

ట్రైలర్ రివ్యూ: జైసింహా

on Jan 9, 2018

ఆరు నూరైనా.. ఎవరి సినిమా ఉన్నా లేకున్నా ప్రతి ఏడాది సంక్రాంతికి తన సినిమా ఉండేలా చూసుకుంటూ.. సంక్రాంతి స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు నటసింహాం నందమూరి బాలకృష్ణ. తెలుగువాడి ఘనకీర్తిని ప్రపంచానికి చాటుతూ గతేడాది సంక్రాంతికి గౌతమీపుత్ర శాతకర్ణిగా వచ్చిన బాలయ్య ఈ సారి జైసింహాగా వస్తున్నాడు. తమిళ విలక్షణ దర్శకుడు కేఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌‌లో మాస్ యాక్షన్‌తో బాలయ్య దుమ్మురేపాడు.. దీనికి ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగం పెంచిన చిత్ర యూనిట్ మరో ట్రైలర్‌ని విడుదల చేసింది.

"మౌనంగా బాధల్ని భరిస్తా.. మూర్ఖంగా ప్రాణాలు తీస్తా," "చావుకి వాస్తు లేదురా.. ఎక్కడినుంచైనా వస్తుంది" అంటూ నటసింహాం పేల్చిన డైలాగులు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. బాలయ్య గత సినిమాల కంటే మరింత అందంగా, స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా హీరోయిన్ నయనతార, బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చే సీన్లు అదిరిపోయేలా ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. చాలా రోజుల తర్వాత కామెడి కింగ్ బ్రహ్మానందంకి ఫుల్ లెంగ్త్ రోల్‌ దొరికినట్లు కనిపిస్తోంది. మొత్తానికి సెంటిమెంట్, యాక్షన్, కామెడీ అన్ని కలగలిపి మూవీని తెరకెక్కించినట్లు ట్రైలర్‌ను బట్టి స్పష్టమవుతోంది.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here