ENGLISH | TELUGU  

నందమూరి బాలకృష్ణ హీరోగా రాజమౌళి సినిమా

on Apr 2, 2011

nandamuri balakrishna wallapapers, nandamuri balakrishna stills, nandamuri balakrishna images,   nandamuri balakrishna pics, nandamuri balakrishna photos, nandamuri balakrishna picturesయువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా, అపజయమెరుగని డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా రానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా ఒక సినిమా నిర్మించబడుతుందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. ఈ యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా, అపజయమెరుగని డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో చిత్రం 2012 వ సంవత్సరం చివరలో ప్రారంభం అయ్యే సూచనలున్నాయట.

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ పరుచూరి మురళి దర్శకత్వంలోని చిత్రంలో త్రిపాత్రాభినయంతో నటిస్తున్నారు. దీని తర్వాత శ్రీరామరాజ్యం, బి.గోపాల్ చిత్రాలు పూర్తయ్యేసరికి దాదాపు అదే సమయం అవుతుంది. ఈలోగా రాజమౌళి "ఈగ" చిత్రాన్ని, దీని తర్వాత ప్రభాస్ హీరోగా ఒక భారీ జానపద చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం రానున్న నవంబర్ లో ప్రారంభం కానుంది. ఈ చిత్రం పూర్తయ్యేసరికి కూడా అదే సమయం అవుతుంది. అసలే హీరోని అద్భుతంగా చూపించే రాజమౌళి ఇప్పటికే భయంకరమైన మాస్ ఇమేజ్ ఉన్న బాలకృష్ణను ఇంకెలా చూపిస్తాడోనని, బాలయ్య అభిమానులూ, సినీ వర్గాలనుకుంటున్నారు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.