English | Telugu

సప్రైజ్ చేశాడు.. షాక్ ఇచ్చాడు...

on Nov 13, 2017

నమిత పెళ్లాడబోతోందంటండోయ్! ఇది నమిత అభిమానులకు చేదు వార్తే అయినా... మనసు దిటవు చేసుకోవాలి.. తప్పదు.  వీర్ అనే కుర్రాడితో పీలకలోతు  ప్రేమలో మునిగింది నమిత.  ఇద్దరూ నవంబర్ 24న తిరుమలలో పెళ్లాడబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నమితే తెలియజేసింది. సీనియర్ నటుడు శరత్ బాబుతో నమిత.. డేటింగ్  చేస్తున్నట్టు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. వాటిని ఖండిస్తూ.. తన పెళ్లి విషయాన్ని బయటపెట్టింది.  నమిత. ఇంకా  ఏంమందంటే.. ‘‘నాపై వస్తున్న పుకార్లన్నీ అబద్ధాలు. ఇలాంటి పుకార్లు వ్యక్తిగత జీవితాన్ని పాడుచేస్తాయ్. తయచేసి నమ్మొద్దు. నవంబర్ 24న నా పెళ్లి. ఈ సమయంలో ఇలాంటి  పుకార్లు వస్తే.. నాశనమయ్యేది నా జీవితమే. దయచేసి వదిలేయండి’ అని ఆవేదన వ్యక్తం చేసింది నమిత. ఇంకా చెబుతూ ‘తన పేరు వీర్. తను పరిచయం కాకముందు.. మగాళ్లపై నాకు నమ్మకమే ఉండేది కాదు.

తను పరిచయం అయ్యాక.. మగాళ్లలో కూడా మంచితనాన్ని  చూడగలిగాను. నా ప్రాణ స్నేహితుడు శశిధర్ ద్వారా వీర్ పరిచయం అయ్యాడు. అప్పట్నుంచి అడపాదడపా మాట్లాడుకునేవాళ్లం. తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. సెప్టెంబర్ 6న నాకోసం ప్రత్యేకంగా బీచ్ దగ్గర క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాడు చేశాడు. అక్కడే.. రొమాంటిక్ గా ప్రపోజ్ చేశాడు. నేను కాసేపు మనిషిని కాలేకపోయాను. అప్పట్నుంచి మా స్నేహం ప్రేమగా మారింది. నవంబర్ 24న పెళ్లితో ఒకటవ్వబోతున్నాం. ఇకపై గాలివార్తలు నాపై రాయొద్దు.. ప్లీజ్’ అని తేల్చిచెప్పేసింది నమిత.

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here