రాహుల్ దర్శకత్వంలో నాగార్జున..!!
on Aug 4, 2018
అక్కినేని వారసుల్లో హీరో సుశాంత్ ఒకరు.. కాళిదాసు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ సరైన హిట్ లేక పదేళ్లుగా హిట్ కోసం ఆశగా ఎదురు చూసాడు.. రీసెంట్ గా సుశాంత్ ఆశ ఆనందంగా మారింది.. సుశాంత్ హీరోగా నటించిన ‘చి॥ల॥సౌ॥’ సినిమా రీసెంట్ గా విడుదలై ప్రేక్షకులు నుండి మంచి మార్కులు పొంది హిట్ అయింది.. ఈ సినిమాకి ‘అందాల రాక్షసి’ సినిమాతో హీరోగా పరిచయం అయిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించడం విశేషం.. మొదటి సినిమాతోనే దర్శకుడిగా సక్సెస్ అయిన రాహుల్ కి నాగార్జున బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.. నాగార్జున రాహుల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడట.. ఇప్పటికే రాహుల్ నాగార్జున కోసం అదిరిపోయే కథను సిద్ధంచేసే పనిలో పడిపోయాడట.. చూద్దాం మరి రాహుల్ నాగార్జునతో కూడా హిట్ కొడతాడేమో.