బిజినెస్ మ్యాన్ గా నాగ్
on Feb 14, 2012
బిజినెస్ మ్యాన్ గా నాగ్...అంటే నాగార్జున "బిజినెస్ మ్యాన్" సినిమాలోనో లేక దాని సీక్వెల్లోనో నటిస్తున్నాడని అర్థం కాదు. వివరాల్లోకి వెళితే యువసామ్రాట్, కింగ్ అక్కినేని నాగార్జునలో ఒక మంచి వ్యాపారవేత్త ఉన్నాడని అర్థమన్నమాట. నాగార్జున గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. తర్వాత పాయిజన్ పబ్ నెలకొల్పారు. "మా" టి.వి.లోబోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఉన్నారు. యన్ గ్రిల్ రెస్టారెంట్ పెట్టారు. అలాగే ప్రస్తుతం యన్ ఏషియా అనే చైనీస్ రెస్టారెంట్ ను కూడా ప్రారంభించనున్నారు.
మార్చ్ లో ప్రారంభించనున్న దీని తాలూకు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ రెస్టారెంట్ ఇంటీరియర్ డెకరేషన్ అంతా నాగార్జునే స్వయంగా దగ్గరుండి చూసుకుంటున్నారట. ఇవన్నీ చూస్తుంటే నాగార్జునలో ఒక మంచి బిజినెస్ మ్యాన్ ఉన్నాడని అంగీకరిస్తారా...? లేదా...?