ఓటీటీ బాటలో నాగ్ వైల్డ్ డాగ్?
on Nov 25, 2020
కాలానికి అనుగుణంగా ముందుకు సాగే కథానాయకుల్లో కింగ్ నాగార్జున ఒకరు. అందుకే.. ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు, ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో... తన కొత్త చిత్రం వైల్డ్ డాగ్ ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట నాగ్. ఇటీవలే షూటింగ్ పార్ట్ ని ఫినిష్ చేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్నీ కుదిరితే నాగ్ లక్కీ మంత్ డిసెంబర్ లో వైల్డ్ డాగ్ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో క్రిస్మస్ కానుకగా స్ట్రీమ్ అయ్యే అవకాశముందని ప్రచారం సాగుతోంది. మరి.. ఈ వార్తల్లో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
వైల్డ్ డాగ్ లో నాగ్ కి జోడీగా దియా మీర్జా నటిస్తుండగా, సయామీ ఖేర్ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనుంది. ఊపిరి, మహర్షి చిత్రాల రచయిత అహిషోర్ సాల్మన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.
Also Read