దేవరకొండ విజయ్‌ని ఫాలో అవుతున్న నాగ్
on Dec 5, 2017
‘అర్జున్ రెడ్డి’ సినిమాను ఎంతమంది ఫాలో అవుతున్నారో తెలీదుకానీ.. మన రామ్ గోపాల్ వర్మ మాత్రం తెగ ఫాలో అయిపోతున్నాడు. ఎలా అంటారా? సరే విషయంలోకెళ్దాం. ‘అర్జున్ రెడ్డి’ పోస్టర్లు గుర్తున్నాయా? ప్రతి పోస్టర్ లో టైటిల్ ఇంగ్లిష్ లోనే కనిపిస్తుంది. తెలుగు సినిమా పుట్టాక... పూర్తిగా ఇంగ్లిష్ లోనే టైటిల్ ని ప్రింట్ చేసి విడుదల చేసిన తొలి సిినిమా ‘అర్జున్ రెడ్డి’. ఆ సినిమా తర్వాత మళ్లీ ఎవరూ ఆ పద్ధతిని ఫాలో అవ్వలేదు. కానీ... మన వర్మ మాత్రం ఫాలో అయిపోతున్నాడు. ప్రస్తుతం ఆయన నాగార్జున కథానాయకునిగా ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు టైటిల్ ఏం పెట్టాలా! అని కొన్ని రోజులుగా నాగ్, వర్మ క్యాంప్ తర్జనభర్జన పడ్డారు. చివరకు గన్, సిస్టమ్ అనే పేర్లలో ఏదో ఒకదాన్ని పెట్టాలని నిర్ణయించేశారు. అయితే.. ఈ టైటిల్... ‘అర్జున్ రెడ్డి’ తరహాలో ఇంగ్లిష్ లోనే ఉండేలా వర్మ ప్లాన్ చేశాడట. ఇక్కడ చిన్న తేడా ఏంటంటే... ’అర్జున్ రెడ్డి‘ అనేది తెలుగు పేరు. టైటిల్ మాత్రం ఇంగ్లిష్ లో ఉంటుంది. రేపు వర్మ-నాగ్ సినిమాకు అనుకున్న టైటిళ్లు గన్, సిస్టమ్.. రెండూ ఇంగ్లిష్ పేర్లే. టైటిల్ కూడా ఇంగ్లిష్ లోనే ఉంటుందన్నమాట. ‘అర్జున్ రెడ్డి’ని అప్పుడందరూ ‘ట్రెండ్ సెట్టర్.. ట్రెండ్ సెట్టర్’ అని అంటే... ఏదో అనుకున్నాం. చివరకు ‘అర్జున్ రెడ్డి’ ఈ విధంగా ట్రెండ్ సెట్టర్ అయ్యిందన్నమాట.
Also Read