సినిమాలకు సమంత దూరం.. చైతూ క్లారిటీ
on Jul 11, 2018
ఏ మాయ చేసావె సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన సమంత.. తన అందం, అభినయంతో ప్రేక్షకులను మాయ చేసింది.. నాగచైతన్యను పెళ్లి చేసుకొని అక్కినేని వారి కోడలైంది.. అయితే ఈమధ్య సమంత ఇక సినిమాలకు దూరమవుతుంది అంటూ వార్తలు మొదలయ్యాయి.. దానికి తగ్గట్టే సమంత కొత్త సినిమాలు అంగీకరించట్లేదు.. దీంతో ఆ వార్తలకు బలం చేకూరింది.. అయితే ఈ విషయంపై తాజాగా నాగచైతన్య స్పందించాడు.. 'ఈమధ్య వచ్చిన వార్తల్లో నిజం లేదు.. తను సినిమాల్లో నటిస్తుంది.. కాకపోతే, అప్పుడప్పుడూ చిన్న పాటి బ్రేక్ తీసుకుంటుందేమో.. అంతకు మించి ఏం ఉండదు.. తనకు సినిమాలంటే ప్యాషన్.. ఈ రంగానికి దూరం కాదు' అని నాగచైతన్య స్పష్టం చేసాడు.. దీన్నిబట్టి సమంత సినిమాలకు దూరం అనే వార్తల్లో నిజంలేదని అర్ధమవుతుంది.
Also Read