త్వరలో ఏ మాయ చేసావె సీక్వెల్
on Jun 6, 2018
ప్రేమకథలు ఎప్పుడొచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారు.. కొన్ని ప్రేమకథల్ని గుండెల్లో పెట్టుకుంటారు.. అలాంటి వాటిల్లో ముందుగా గుర్తొచ్చేవి.. దేవదాసు, మరోచరిత్ర, గీతాంజలి, తొలిప్రేమ.. అయితే ఇప్పటి యంగ్ జనరేషన్లో ప్రేమకథ అంటే ముందుగా 'ఏ మాయ చేసావె' గుర్తొస్తుంది.. నాగచైతన్య, సమంతలు 'ఏ మాయ చేసావె' తో అంతలా మాయ చేసారు మరి.. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యువత మనస్సు దోచుకుంది.. అయితే ఇప్పుడు గౌతమ్ మీనన్ ఈ సినిమాకి సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి.. అదే నిజమైతే మనం మరొక్కసారి 'ఏ మాయ చేసావె' మాయలో పడటం గ్యారెంటీ...