మెగా హీరోతో `ఇస్మార్ట్...` పోరి
on Aug 20, 2019
`ఇస్మార్ట్ శంకర్ ` లో వరంగల్ చాందిని గా యూత్ మతి పోగొట్టిన నభ నటేష్ వరుస చిత్రాలతో బిజీ అవుతోంది. రవి తేజ సరసన `డిస్కో రాజా` లో నటిస్తోన్న నభ మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ కి ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకసారి వివరాల్లోకో వెళితే ...మెగా హీరో సాయి తేజ్ , ఇంటలిజెంట్ డైరెక్టర్ దేవా కట్ట డైరెక్షన్ లో ఓ సినిమా చేసేస్తున్నాడంటూ వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా నభ నటేష్ ని హీరోయిన్ గా తీసుకున్నట్లు న్యూస్ వస్తున్నాయి. శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యానర్ పై భగవాన్, పుల్లారావు లు సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.
Also Read