ENGLISH | TELUGU  

యన్ టి ఆర్ కొత్త చిత్రం దమ్ము

on Mar 24, 2011

 

ntr wallpapers, ntr stills, ntr pics, ntr photos, ntr pictures, ntr imagesయన్ టి ఆర్ కొత్త చిత్రం దమ్ము అని తెలిసింది. వివరాల్లోకి వెళితే యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా, తమన్నా హీరోయిన్ గా, బోయపాటి శీను దర్శకత్వంలో క్రియెటీవ్ కమర్షియల్స్ పయతాకంపై, అలగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్న చిత్రానికి ముందుగా "రచ్చ"అన్న టైటిల్ అనుకున్నారు. కానీ ఆ పేరుతో సంపత్ నంది ఒక కథని రిజిస్టర్ చేయటం వల్ల, "చురకత్తి" అన్న పేరుని పరిశీలించారు. కానీ ప్రస్తుతం "దమ్ము" అన్న పేరుని ఈ చిత్రానికి నిర్ణయించినట్లు సమాచారం.

ఈ "దమ్ము" అనే పేరుని ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం ఛాంబర్ లో క్రియెటీవ్ కమర్షియల్స్ పతాకంపై రిజిస్టర్ చేయబడి ఉందని ఫిలిం నగర్ వర్గాల కథనం. ఆ బ్యానర్ లో తీస్తున్న సినిమాలో హీరో యన్ టి ఆర్, హీరోయిన్ తమన్నా, దర్శకుడు బోయపాటి శీను కావటం వల్ల ఆ సినిమాకే ఈ "దమ్ము" అన్న పేరుని నిర్ణయించినట్లుగా అనుకోవాల్సి వస్తూంది. ప్రస్తుతం యన్ టి ఆర్ "అదుర్స్", "బృందావనం" చిత్రలతో హిట్లు సాధించారు.

అతను హీరోగా నటించిన "శక్తి" మార్చ్ 30 వ తేదీన విడుదల కానుంది. అలాగే "సింహా" వంటి బ్లాక్ బస్టర్‍ హిట్ చిత్రం తర్వాత బోయపాటి శీను దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది కావటం వల్ల ఈ చిత్రం మీద అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం బహుశా దసరా పర్వదినం సందర్భంగా విడుదలయ్యే అవకాశాలున్నాయి.


 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.