బిగ్ సర్ ప్రైజ్‌తో ఎన్టీఆర్
on Oct 4, 2018
విశ్వవిఖ్యాత నటుడు లైఫ్ హిస్టరీ ఆధారంగా బాలయ్య టైటిల్ పాత్రలో రూపొందుతున్న బయోపిక్ `ఎన్టీఆర్`. ఈ చిత్రం ఇటీవల కాలంలో రోజుకో న్యూస్ తో ఈ చిత్రం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో సర్ ప్రైజింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే.. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు పార్ట్ లుగా తీసుకరావడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. పార్ట్1 `కు `ఎన్టీఆర్ కథానాయకుడు` పార్ట్ `2కు `ఎన్టీఆర్ ప్రజానాయకుడు ` అనే టైటిల్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.
ఎన్టీఆర్ సినిమాల్లోకి రాకముందు, సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయన జీవితం ఎలా సాగిందనేది పార్ట్ వన్ లో చూపిస్తున్నారట. ఎన్టీఆర్ పార్టీ స్థాపించడం , పొలిటికల్ నాయకుడుగా ఎదగడాన్ని పార్ట్ 2లో చూపిస్తారట. తొలి భాగాన్ని జనవరి 9న విడుదల చేసి రెండో పార్ట్ ని జనవరి లో కానీ ఫిబ్రవరి 14న విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నారట. నిజంగా ఇది బిగ్ న్యూస్ గానే చెప్పొచ్చు. హీరోగా, పొలిటికల్ లీడర్ గా తెలుగువారి మనసుల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది ఎన్టీఆర్‌కు. కాబట్టి అందరికీ కనెక్టయ్యేలా ఈ చిత్రాన్ని క్రిష్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడట. ఇప్పటికే పాత్రల గెటప్ లతో , నటీనటుల ఎంపికతో సగం సక్సెస్ సాధించాడు క్రిష్.
Also Read