ఎందుకిలాంటి సినిమా చేయరని నా వైఫ్ అడిగింది
on Jan 13, 2020
నందమూరి కల్యాణ్ రామ్ నటించిన ఫస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఎంత మంచివాడవురా'. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో "అన్నయ్య ఇటువంటి ఫ్యామిలీ సినిమా చేస్తే చూడాలని ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నాను. ఈ సినిమాతో నా కోరిక తీరింది" అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నారు. కల్యాణ్ రామ్ తమ్ముడు మాత్రమే కాదు... వైఫ్ కూడా అతడిని ఇటువంటి ఫ్యామిలీ సినిమా లో చూడాలని కోరుకున్నారు.
"సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన శతమానం భవతి కి మా ఇంట్లో అందరూ వెళ్లారు. పని ఉండడంతో నేను వెళ్ళలేదు. సినిమా చూసి వచ్చాక నా వైఫ్ 'మీరు కమర్షియల్ సినిమాలు చేస్తున్నారు. ఇటువంటి సినిమా ఎందుకు చెయ్యరు? మీరు చేస్తే బావుంటుంది' అని అంది. 'అమ్మా... చెయ్యడానికి నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. నేను రెడీ. దర్శకులు అటువంటి పాత్రలో నేను చేయగలనని నమ్మాలి కదా' అని చెప్పాను. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ గుజరాతీ సినిమా ఆక్సిజన్ తో నా దగ్గరకు వచ్చారు. దర్శకుడు ఆ సినిమాలో సోల్ తీసుకుని, చాలా మార్పులు చేశారు" అని కల్యాణ్ రామ్ అన్నారు.
"గుజరాతి సినిమా ఆక్సిజన్ లో కోర్ పాయింట్ నాకు నచ్చింది. అయితే... అదొక ఫన్ ఫిల్మ్. కొన్ని సీన్స్ మారిస్తే బావుంటుందని నాకు అనిపించింది. అదే శివలెంక కృష్ణప్రసాద్ గారికి చెప్పాను. ఆయన దర్శకుడు సతీష్ వేగేశ్న కథ చెప్తాడు. వినండి అన్నారు. అందులో సోల్ మిస్ చేయకుండా... కమర్షియల్ విలువలు జోడించి దర్శకుడు కొత్త కథ రెడీ చేశారు. నాకు నచ్చింది. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చా" అని కల్యాణ్ రామ్ అన్నారు. సినిమా చూసి తన వైఫ్ ఏమన్నారు అనేది సినిమా విడుదల తరువాత చెబుతానని ఆయన అన్నారు.
Also Read