ENGLISH | TELUGU  

ప్రపంచంలోనే బ్యూటీ "ఫుల్ "

on Sep 21, 2020

ప్రకృతిలో అందం అంటే అమ్మాయి. అమ్మాయి అంటే ఆకర్షణ. ఆకర్షణ అంటే ఆకట్టుకునే తత్వం. అయితే శరీరసౌందర్యంతో పాటు వ్యక్తిత్వం కూడా ఆకట్టుకునేలా ఉంటే అదే నిజమైన అందం. ఆకట్టుకునే బాహ్యసౌందర్యానికి  కృషి పట్టుదల, ఆత్మవిశ్వాసం జోడైనప్పుడు వారి అందం ద్విగుణీకృతం అవుతుంది. అలాంటి కొంత మంది మగువల గురించి ...

మొజ్దా జమాల్జదా
సంగీతం ప్రపంచంలో ఆమె పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. గాయినీగా, రచయితగా, వ్యాఖ్యాతగా, నటిగా ఆమె ఇంటర్నేషనల్ మీడియాలో స్థానం సంపాదించారు.  ఆఫ్ఘానిస్తాన్ లో జన్మించిన మొజ్దా ఐదేండ్ల వయసులో వారి కుటుంబం కెనడా వెళ్ళి అక్కడే స్థిరపడింది. సంగీతంపై ఆమెకు ఉన్న మక్కువతో ఫేమస్ గాయనీ గా పేరుతెచ్చుకుంది. ఆమె రాసి సంగీతంకూర్చి పాడిన ఆఫ్ఘన్ గర్ల్ పాట ఆమెను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇంటర్నేషనల్ టీవీల్లో, రేడియో స్టేషన్లలో ఆమె షోలు ప్రసారం అయ్యాయి. ఆఫ్గనిస్తాన్ లో మహిళల జీవితాలను, అక్కడ నెలకొన్న పరిస్థితులను మీడియా ద్వారా ప్రపంచానికి పరిచయం చేసింది. అనేక అవార్డులు సొంతం చేసుకుంది.

అలెక్సాండ్రా డాడారియో
అమెరికన్ నటి. ఎదుటివారి చూపులను కట్టిపడేసే ఆమె కండ్లు అయస్కాంత క్షేత్రాలు అనడంతో అతిశయోక్తి లేదేమో. మూడు పదులు దాటిన వయసులోనూ పసిపాపాయి లాంటి స్వచ్ఛమైన నవ్వు అలెక్సా సొంతం. న్యూయార్క్ లో జన్మించిన అలెక్సా చిన్నతనంలోనే నటనారంగం పై ఆసక్తి పెంచుకుంది. అనేక సినిమాల్లో నటిస్తూ అంతర్జాతీయ చలనచిత్రరంగంలో ప్రత్యేక స్థానం సొంతం చేసుకుంది.

ఫహ్రియో ఎవ్సెన్
టర్కిష్ నటి. సినిమాల్లోనూ, టీవీ సిరీస్ లోనూ తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసే ముగ్దమనోహరమైన రూపం ఫహ్రియో సొంతం. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఆమె జర్మనీలో టర్కీష్ కుటుంబంలో జన్మించారు. ఆమె 19ఏండ్ల వయసులో టర్కీ వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. అంతర్జాతీయంగా ప్రసిద్ధి గాంచిన అనేక టెలివిజన్ సిరీస్ లో ఆమె ముఖ్య పాత్రల్లో నటిస్తూ తన అభినయంతోనూ, అందంతోనూ ప్రేక్షకుల అభినందనలు అందుకుంటుంది.

మార్గొట్ రోబీ
హాస్యనటిగా ప్రేక్షకుల మనసులు దోచుకుంటున్న ఆస్ట్రేలియన్ నటి మార్గొట్.  ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వంది మంది వ్యక్తుల్లో ఒకరుగా 2017లో టైమ్ మ్యాగజైన్ సర్వేలో చోటు దక్కించుకుంది. ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా పేరుతెచ్చుకుంది. కాలేజీ రోజుల్లోనే డ్రామా ఆర్టిస్ట్ గా మంచి పేరుతెచ్చుకున్న ఆమె ఆ తర్వాత నటనారంగంలో రాణించారు. ఆకర్షణీయమైన రూపంలో పాటు ఆత్మవిశ్వాసం నిండిన పాత్రల్లో నటించి ఎన్నో అవార్డులు అందుకున్నారు.

అమండా సెర్నీ
ఫిట్ సెస్ ట్రైనర్ గా కెరీర్ ను ప్రారంభించినా ఆ తర్వాత అనుహ్యంగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. సెస్సేషనల్ యూట్యూబ్ స్థార్ గా సెర్నీ గుర్తింపు పొందారు. నటనా నైపుణ్యంతో పాటు హావభావాల ప్రదర్శనలో వైవిధ్యం చూపిస్తూ కోట్లాదిమంది వీక్షకులను తన ఖాతాలో నమేదు చేసుకున్నారు. ఆమెకు యూట్యూూబ్ లో దాదాపు మూడు మిలియన్లు, ఇన్ స్టాగ్రామ్ లో 25 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు

దీపిక పదుకొనె
మోడల్ గా కెరీర్ ప్రారంభించి నటిగా అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది దీపిక. తన వైవిధ్యభరితమైన నటనతో, పాత్రలో ఒదిగిపోయే నటనాకౌశల్యంతో ప్రేక్షకుల చేత శెభాష్ అనిపించిన ఆమె అభినయం ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకునేలా చేసింది. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాష్ పడుకొనె కూతురు. క్రీడారంగంపై కాకుండా నటనపై మక్కువ పెంచుకున్న ఆమె కాలేజీ రోజుల్లోనే మోడల్ కెరీర్ ను ప్రారంభించింది. తన అద్భుతమైన నటనతో మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకుంది. పద్మావతి సినిమాలో ఆమె నటన విమర్శకుల చేత కూడా ప్రశంసలు పొందింది. ప్రముఖ హీరో రణ్ వీర్ సింగ్ తో 2018లో ఆమె వివాహం జరిగింది.

డకోటా జాన్సన్
ప్రపంచ ప్రఖ్యాతి పొందిన నటి. వైవిధ్యభరితమైన పాత్రల్లో జీవించగల సత్తా ఉన్న నటి. పదేళ్ల వయసులోనే తన ఫర్మామెన్స్ తో అదుర్స్ అనిపించిన ఆమె ఆ తర్వాత ఎన్నో పాత్రల్లో నటించారు. హర్రర్, కామెడీ, యాక్షన్ ఇలా ఏ పాత్రలోనైన ఇమిడిపోయే నటనతో విశ్వవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. నటిగా ఎలాంటి పాత్రతోనైనా మెప్పించగల ఆమెది సున్నితమైన వ్యక్తిత్వం.

టేలర్ మేరీ హిల్
నటనతోనే కాదు వ్యక్తిత్వంతో ఆకట్టుకునే నటి టేలర్. ఆమె ముగ్ధమనోహర సౌందర్యం చూపు తిప్పుకోనివ్వదు. ఆమె  క్యాట్ వాక్ చేసినా, ర్యాంప్ పై వయ్యారాలు వొలకపోసినా, సాదాసీదాగా నడుస్తూ వచ్చినా అక్కడ ఉన్నవారందరీ చూపులు ఆమె పైనే. సముద్ర తరంగాల మాదిరిగా కదులుతూ.. హంసలా అడుగులు వేస్తూ తన అందంతో కట్టిపడేస్తుంది. టేలర్ ఇన్ స్టాగ్రామ్ ఫాలో అయ్యేవారు స్క్రీన్ ను ఎప్పటికీ అలా చూస్తునే ఉండిపోతారు. అంతటి అందం ఆమె సొంతం. ఒక మాటలో చెప్పాలంటే దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్య అనాలేమో

ప్రియాంక చోప్రా
అందం, అభినయంతో పాటు నిరాడంబరంగా ఎదుటివారిని ఆకట్టుకునే సహజసౌందర్యం ప్రియాంక సొంతం. సంప్లిసిటీ ఇజ్ మదర్ ఆఫ్ బ్యూటీ అన్నట్టుగా ఉండే ప్రియాంకను చూడాలంటే రెండుకండ్లు సరిపోవు.. ఆమె ఆత్మసౌందర్యాన్ని చూసేందుకు మూడోకన్ను కూడా ఉండాల్సిందే. అందుకే ఆమె ప్రపంచ సుందరి కిరీటాన్ని(2000) దక్కించుకున్నారు. సినీరంగంలోనూ తమ అద్భుతమైన నటనతో ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న నటి.  సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

బెయాన్స్

ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న ఆకర్షణీయమైన సౌందర్యం, వ్యక్తిత్వం ఆమె సొంతం. గాయని, నటి, నిర్మాత, మోడల్, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ఇలా అనేక రంగాల్లో తన ప్రతిభను చాటుతున్న మహిళ
బెయాన్స్.  బహుముఖప్రజ్ఞాశాలిగా ప్రేక్షకులను అలరించే ఆమె 17సార్లు గ్రామీ అవార్డును అందుకుంది. 46సార్లు గ్రామీ అవార్డు కోసం నామినేట్ అయ్యారు. ఆమె రూపొందించిన ఎన్నో ఆల్బమ్స్ ప్రపంచ మార్కెట్ లో హాట్ కేట్స్ గా అమ్ముడుపోయాయి. ఎన్నో సామాజిక సేవకార్యక్రమాల ఫండింగ్ కోసం ఆమె ప్రదర్శనలు ఇస్తూ తనలోనూ మానవత్వాన్ని చాటుకుంటారు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.