ఎన్టీఆర్ బయోపిక్‌లో మోక్షజ్ఞ ..!!
on Jul 11, 2018
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.. అయితే మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం బాలకృష్ణ, క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఎన్టీఆర్ బయోపిక్ ద్వారానే మోక్షజ్ఞను తెరంగేట్రం చేయించాలనే ఆలోచనలో బాలకృష్ణ ఉన్నారట.. ఈ బయోపిక్ లో ఎన్టీఆర్ టీనేజ్ స్టోరీ కూడా చూపిస్తారంట.. ఆ పాత్ర ఎన్టీఆర్ మనవడు మోక్షజ్ఞ చేస్తే బాగుంటుంది, మోక్షజ్ఞ తెరంగేట్రానికి ఇదే కరెక్ట్ ఛాయిస్ అని బాలకృష్ణ అనుకుంటున్నారట.. దీనికి దర్శకుడు క్రిష్ కూడా అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది.. అంతా అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ తాత పాత్రతోనే జరుగుతుంది అనమాట.. చూద్దాం మరి ఏం జరుగుతుందో.