అభిమన్యుడిగా మోక్షజ్ఙ!
on Nov 14, 2017
అవును..నిజమే... మోక్షజ్ఙ అభిమన్యుడిగా కనిపించబోతున్నాడు. మోక్షజ్ఙ తొలి సినిమా ఎవరితో ఉంటుంది? అనేది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉండిపోయింది. దానికి తెర దించుతూ... మోక్షజ్ఙ తొలి సినిమాకు సంబంధించిన న్యూస్ అంతరంగిక వర్గాల నుంచి బయటకు వచ్చేసింది. మోక్షజ్ఙ తొలి సినిమా బాలయ్య తీయనున్న ఎన్టీయార్ బయోపిక్కే నట. అందులో మోక్షజ్ఙ ఓ పదినిమిషాల ఎపిసోడ్లో కనిపించనున్నాడు. ఇంతకీ ఎన్టీయార్ బయోపిక్ కి అభిమన్యుడి పాత్రకు సంబంధం ఏంటా? అనుకుంటున్నారా? విషయం ఏంటంటే.. ఎన్టీయార్ బయోపిక్ లో మోక్షజ్ఙ తన తండ్రి బాలయ్య పాత్రే పోషించనున్నాడట. అయితే.. ఆ పాత్ర నిడివి చాలా తక్కువ ఉంటుందట. ‘దానవీర శూరకర్ణ’ సినిమా షూటింగ్ లో జరగిన కొన్ని సంఘటనలు ఈ కథలో ఉంటాయట. ఆ ఎపిసోడ్ లోనే మోక్షజ్ఙ తన తండ్రి బాలయ్యగా కనిపిస్తాడట. బాలయ్య అందులో చేసిన పాత్ర అభిమన్యుడి పాత్ర. మోక్షజ్ఙ కూడా అభిమన్యుడి గెటప్ లోనే దర్శనమిస్తాడని విశ్వసనీయ వర్గాల భోగట్ట. ‘దానవీరశూరకర్ణ’లో బాలయ్యపై ఎన్టీయా ార్ తీసిన కొన్ని సన్నివేశాలను ఇందులో మోక్షజ్ఙపై చిత్రీకరిస్తారట. అంటే... ఆ సీన్స్ లో బాలయ్య.. కృష్ణ, కర్ణ, సుయోధన పాత్రల్లో త్రిపాత్రాభినయంలో కనిపిస్తే... ముగ్గురు బాలయ్యల మధ్య అభిమన్యుడిగా మోక్షజ్ఙ విశ్వరూపం చూపిస్తాడన్నమాట. సోలో హీరోగా పరిచయం కాకముందే.. మోక్షజ్ఙతో ఓ ఛాలెంజింగ్ రోల్ చేయించాలనేది బాలయ్య ఆలోచన. దాన్ని ఈ విధంగా కార్యరూపంలోకి తెచ్చాడు బాలయ్య. అభిమానులూ... ఇంకెందుకు ఆలస్యం.. పండగ చేసుకోండి.