`గల్లీబాయ్`రీమేక్‌లో మెగా హీరో?
on Feb 19, 2019
ఇటీవల విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోన్న బాలీవుడ్ చిత్రం `గల్లీబాయ్` అయితే ఈ సినిమా పై పలువరు నిర్మాతల చూపు పడింది. ఇప్పటికే తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేయాలని కొంత మంది నిర్మాతలు బాలీవుడ్ నిర్మాతలో చర్చలు జరుపుతున్నారని సమాచారం. వరుస సక్సెస్ లతో బాలీవుడ్ లో దూసుకుపోతున్న ఎనర్జిటిక్ స్టార్ రణ్ వీర్ సింగ్ `గల్లీబాయ్` లో నటించాడు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమా ప్రజంట్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో టాప్ ప్రొడ్యూస్ అయిన అల్లు అరవింద్ రీమేక్ చేయాలని భావిస్తున్నాడట. ఈ రీమేక్ లో సాయి ధరమ్ తేజ్ ని హీరోగా అయితే బావుంటుందన్న ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రటకన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ చిత్రలహరి చిత్రంలో నటిస్తున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.
Also Read