వర్మకి మెగా ఫ్యాన్స్... థ్యాంక్స్చెప్పుకోవాల్సిందే
on Apr 21, 2018
మెగా ఫ్యామిలీ అంటేనే మండిపడిపోతుంటాడు వర్మ. పైగా ఇప్పుడు మెగా హీరోలంతా ఆర్జీవికి పరమ యాంటీ. అలాంటప్పుడు వర్మకి థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి? అనుకుంటున్నారేమో. పరోక్షంగా మెగా ఫ్యామిలీకి చాలా హెల్ప్ చేసేస్తున్నాడు వర్మ. అదెలాగంటారా... ఈమధ్య మెగా ఫ్యామిలీలో కనిపించని అడ్డుగోడలు ఎక్కువైపోతున్నాయన్న సంగతి ప్రతీ మెగా అభిమానికీ తెలుసు. పవన్ - బన్నీకి మధ్య ఓ గోడ.. పవన్ - అరవింద్ మధ్య మరో గట్టి గోడ. బన్నీ - చరణ్ మధ్యలో కూడా ఇదే స్థాయిలో ఓ గోడ.. అలా మెగా హీరోల మధ్య ఉండే సఖ్యత ఏపాటిదో వాళ్లకు బాగా తెలుసు. ఇప్పుడు వర్మ మూలంగానే వీళ్లంతా కలిసిపోయారు. కలసి పోరాడే స్థాయికి ఎదిగారు. శ్రీరెడ్డి వెనుక వర్మ ఉన్నాడన్న సంగతి తెలియగానే.. అరవింద్ మీడియా ముందుకొచ్చి.. వర్మని చీచుడు, నికృష్ణుడు అంటూ భారీ పదాలతో.. ఆడేసుకున్నారు. ఆ వెంటనే పవన్ కల్యాణ్ రంగంలోకి దిగి... ఇండ్రస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసేశాడు. ఈ పోరాటంలో పాలు పంచుకోవడానికి బన్నీ ఆఘమేఘాల మీద ఊడిపడ్డాడు. ఫిల్మ్ ఛాంబర్లో పవన్ కనిపించగానే గట్టిగా అలింగనం చేసుకుని తన ప్రేమని చూపించాడు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటైపోయింది. ఈ పుణ్యం కట్టుకుంది రాంగోపాల్ వర్మనే. వర్మవేస్తున్న వేషాలు,చేసే తమాషాలూ జస్ట్ టైమ్ పాస్ వ్యవహారాలే. వాటి వల్ల ఎవరికైనా ఉపయోగం జరిగిందంటే అది మెగా ఫ్యామిలీకే. అందుకే వర్మకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మరి మీరేమంటారు..??