విజయ్ దేవరకొండతో అనుకుంటే... నవీన్ చంద్రతో సెట్ అయింది!
on Sep 21, 2020
మరాఠీలో ఆరేళ్ల క్రితం 'హ్యాపీ జర్నీ' అని ఒక సినిమా విడుదలైంది. మంచి విజయం సాధించింది. దాన్ని తెలుగులో రీమేక్ చేయాలని లక్కీ మీడియా బెక్కం వేణుగోపాల్ రైట్స్ తీసుకున్నారు. సినిమాలో ఎమోషనల్ కంటెంట్ తెలుగు ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అవుతుందని ఆయన నమ్మకం. ఒక టైమ్లో విజయ్ దేవరకొండతో రీమేక్ చేయాలనుకున్నారు. 'అర్జున్ రెడ్డి' విడుదలై, అతడు ఓవర్ నైట్ స్టార్ అవ్వడంతో కుదరలేదు. ఇప్పటికి ఆ రీమేక్ సెట్ అయింది. ఇందులో నవీన్ చంద్ర నటించనున్నాడు.
విశాఖపట్టణం, అరకు నేపథ్యంలో 'హ్యాపీ జర్నీ' రీమేక్ చేయనున్నారు. ఓ 30 రోజుల పాటు అక్కడ చిత్రీకరణ చేస్తారట. ఇందులో నవీన్ చంద్రకి సిస్టర్ పాత్రలో అవికా గోర్ నటించనుంది. కొత్త దర్శకుడు కార్తీక్ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ సినిమాలో హైలైట్ అవుతుందని యూనిట్ నమ్మకంగా ఉంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కథలో కొన్ని మార్పులు చేశారని సమాచారం.