క్రేజీ హీరో తో 'మజిలీ' దర్శకుడు
on Apr 10, 2019
హీరో కైనా , డైరెక్టర్ కైనా ఒక సినిమా హిట్టయితే చాలు అవకాశాలు వరుస పెట్టి వస్తూనే ఉంటాయి. అలాంటిది ... వరుసగా రెండు సక్సెస్లు వస్తే ఆ దర్శకుడి డిమాండ్ మామూలు గా ఉండదు. ఇప్పుడు శివ నిర్వాణ కు అలాంటి డిమాండే పెరిగిపోయింది. నిన్ను కోరి మూవీ తో హిట్ కొట్టి న శివ నిర్వాణ రీసెంట్ గా నాగచైతన్య , సమంత జంటగా వచ్చిన `మజిలీ ` తో బిగ్ సక్సెస్ సాధించాడు. ఇక రెండు షేడ్స్ లో నటించి మెప్పించిన నాగ చైతన్య కు విమర్శకుల ప్రశంశలు దక్కుతున్నాయి. సమంత పెరఫార్మెన్సు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అంటున్నారు.
ఇక లేటెస్ట్ సమాచారం ప్రకారం శివ నిర్వాణకు మంచి ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో విజయ్ దేవరకొండ తో శివ నిర్వాణ ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే మరో సారి వీరిద్దరి కలయికలో సినిమా రాబోతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే విజయ్ కి శివ స్టోరీ కూడా చెప్పాడనీ, విజయ్ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాడని సమాచారం. ఈ సారైనా వీరిద్దరి కాంబినేషన్ సినిమా ఉంటుందా, లేదా తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.