English | Telugu

ఎన్టీయార్ పిచ్చి సినిమాలు చేశాడు!

on Dec 29, 2017


పవర్ స్టార్ ని కత్తి మహేశ్ టార్గెట్ చేయడం... కత్తి మహేశ్ ని పవర్ స్టార్ అభిమానులు టార్గెట్ చేయడం.. ఈ తంతు గత కొన్ని నెలలుగా జరుగుతూనే ఉంది. నిర్విరామంగా, నిరాటంకంగా గత కొన్ని నెలలు ఈ తంతు ఆగకుండా జరుగుతూనే ఉంది. అయితే... ఈ సారి కత్తి మహేశ్ టార్గెట్ వేరే హీరోలపై మళ్లింది. ఈ దఫా ఆయన నోటికి బలైపోయిన హీరోలు ఎవరా! అనుకుంటున్నరా? సరే... విషయంలోకెళ్దాం.

ఈ మధ్య కత్తి మహేశ్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వూలో ‘మీరు పవన్ నే ఎందుకు టర్గెట్ చేస్తారు? మీరు ఎన్టీయార్ అభిమానా? అని సదరు జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కత్తి మహేశ్ సమాధానం ఇస్తూ.. ‘నేను జర్నలిస్ట్ ని. సినిమాను సినిమాగా చూస్తాను. అంతేకానీ నాకు ఎవరిపై ప్రత్యేక అభిమానాలు ఉండవ్. టాలీవుడ్ లో బెస్ట్ యాక్టర్ ఎవరు? అనడిగితే... ఒక జర్నలిస్ట్ గానే సమాధానం ఇస్తా.

నాకు తెలిసి టాలీవుడ్ లో తారక్, నాని బెస్ట్ యాక్టర్లు. ఇది నిజం. నిజం చెబితే ఫ్యాన్సేనా? తారక్ కు కూడా దురాభిమానులుంటారు. వారందరూ తారక్ ని తిడితే నాకు కోపం రావాలిగా! అలాంటి దేం లేదు కదా. నాకు తెలిసి తారక్ కూడా చాలా పిచ్చి సినిమాల్లో చేశాడు. వాటిని కూడా నేనేం పొగడలేదే. పిచ్చి సినిమాలను పిచ్చి సినిమాలనే చెప్పాను. నాని కూడా మంచి నటుడు. కాకపోతే... ఈ మధ్య ప్రతి సినిమాలో ఒకే తరహా యాక్టింగ్ చేస్తున్నాడు. మార్చుకుంటే మంచిది. ఇది జర్నలిస్ట్ గా నా అభిప్రాయం. నేను మళ్లీ మళ్లీ చెబుతున్నా. నేను ఎవరి అభిమానినీ కాదు. హీరోలను దేవుళ్లను చేసే పిచ్చి నాకు లేదు. అలాంటి పైత్యం ఎవరికీ మంచిది కాదు’ అని చెప్పుకొచ్చాడు.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here