మహేష్ బాబు చేతుల మీదుగా నితిన్ కళ్యాణం..!!
on Aug 3, 2018
సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా యంగ్ హీరో నితిన్ కళ్యాణం ఏంటి అనుకుంటున్నారా?.. ఇక్కడో ట్విస్ట్ ఉందిలేండి.. నితిన్ హీరోగా నటించిన 'శ్రీనివాస కళ్యాణం' సినిమా త్వరలో విడుదలకానుంది.. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ నిన్న మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలైంది.. ఈ ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తుంది.. శతమానంభవతి ఫేమ్ సతీష్ వేగేశ్న ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
శతమానంభవతి సినిమాతో ప్రేక్షకుల మనస్సు గెలుచుకున్న సతీష్ 'శ్రీనివాస కళ్యాణం' సినిమాతో మరింత పేరు సంపాదించేలా కనిపిస్తున్నారు.. పెళ్లి గొప్పదనం గురించి చెప్పడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం.. 'పెళ్లంటే పెళ్లిలా జరగాలి ఫంక్షన్ లా కాదు' అనే డైలాగ్ తో, ట్రైలర్ లోనే సినిమా ఎలా ఉండబోతుందో చూపించారు దర్శకులు.. ట్రైలర్ తో ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద అంచనాలు, ఆసక్తి మరింత పెరిగాయి.. ట్రైలర్ విడుదలలోనే కాదు సినిమా విడుదలలోనూ మహేష్ కి బంధం ముడిపడి ఉంది.. శ్రీనివాస కళ్యాణం ఆగష్టు 9 న మహేష్ బాబు జన్మదినం రోజు విడుదల కానుంది.. మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలైన నితిన్ శ్రీనివాస కళ్యాణం ట్రైలర్ చూస్తుంటే, మహేష్ జన్మదినం రోజు విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకునేలా కనిపిస్తుంది.. గతంలో ఇదే రోజున బొమ్మరిల్లు సినిమా విడుదలై ఘన విజయం సాధించడం విశేషం.