అమెరికాలో అరుదైన రికార్డు సృష్టించిన మహేష్
on Jan 13, 2020
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా తొలిరోజు నలభై ఆరు కోట్ల 77 లక్షల రూపాయల షేర్ సాధించింది. ఓవర్సీస్ మార్కెట్ లో కూడా సినిమాకు బీభత్సమైన వసూళ్లు వస్తున్నాయి. ఆల్రెడీ ఈ సినిమా వన్ మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. భారీ బడ్జెట్ సినిమాలకు, అందులోనూ మహేష్ వంటి స్టార్ హీరోలు నటించిన సినిమాలకు వన్ మిలియన్ వసూళ్లు రావడం పెద్ద విశేషమేమీ కాదు. అయితే... పదోసారి మహేష్ ఈ ఘనత సాధించడం విశేషమే. అవును... ఇప్పటి వరకు మహేష్ నటించిన 10 సినిమాలు ఓవర్సీస్ మార్కెట్లో వన్ మిలియన్ డాలర్ల కలెక్షన్స్ మార్క్ క్రాస్ చేశాయి. ఇది అరుదైన రికార్డ్. మహేష్ సాధించిన రికార్డ్. అందుకే, అమెరికా మార్కెట్ లో వసూళ్ల వేటలో సరిలేరు మహేష్ కెవ్వరు.
సంక్రాంతి సందర్భంగా జనవరి 11న విడుదలైన ఈ సినిమా మహేష్ అభిమానులకు నిజమైన పండగ తీసుకొచ్చింది. ఇటీవల కాలంలో సెట్టిల్డ్, డిగ్నిఫైడ్ క్యారెక్టర్స్ చేసిన మహేష్... చాలా సంవత్సరాల తర్వాత దూకుడు, ఖలేజా సినిమాల్లో మహేష్ ను గుర్తు చేశాడు. హుషారైన పాత్ర చేశాడు. పాటల్లో స్టెప్పులు ఇరగదీశాడు. దాంతో అభిమానులు పండగ చేసుకున్నారు. సెకండాఫ్ విషయంలో కొంత నెగిటివ్ టాక్ వచ్చినా... అది వసూళ్లపై ఏమాత్రం ప్రభావం చూపడం లేదు.