మహేష్ జుట్టు గురించి సితార కామెంట్స్
on Apr 24, 2020
సూపర్‌స్టార్ మహేష్‌బాబు జుట్టు గురించి ఆయన కూతురు సితార ఘట్టమనేని కామెంట్స్ చేసింది. కామెంట్ అంటే నెగెటివ్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి పాజిటివ్ కామెంట్స్. సమయం, సందర్భం లేకుండా జుట్టు గురించి కామెంట్స్ ఏంటని అనుకుంటున్నారా? లాక్డౌన్ వల్ల మహేష్ బాబు ఇంట్లోనే ఉంటున్నారు. పిల్లలు కూడా! ఇంట్లో తండ్రి పిల్లలు ఏం చేస్తున్నదీ ఎప్పటికప్పుడు నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. లేటెస్టుగా మహేష్‌కి సితార హెడ్ మసాజ్ చేసిన ఫొటోలు షేర్ చేశారు.
"గౌతమ్ తన గేమ్ తను ఆడుకుంటున్నాడు. మహేష్ బాబుకి హెడ్ మసాజ్ చేసే వాలంటీర్ ఉన్నారు. అదీ కేవలం రెండు నిమిషాల్లో హెడ్ మసాజ్ ఫినిష్ చేసే వాలంటీర్. ఎలా ఉందని అడిగితే మహేష్ బావుందని చెప్పారు" అని నమ్రత పేర్కొన్నారు. "నాన్న (మహేష్ బాబు)కి హెడ్ మసాజ్ చేయాలనుకున్నాను. నాన్న హెయిర్ మెత్తగా, సాఫ్ట్ గా ఉంది. నేను మసాజ్ చేయడం నచ్చిందని అన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది" అని సితార ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అదీ సంగతి!!