మహేష్ బర్త్ డే గిఫ్ట్.. ఫాన్స్ కి ఫుల్ కిక్
on Aug 9, 2018
సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా వెండితెరకు పరిచయమైన మహేష్ బాబు సూపర్ స్టార్ గా ఎదిగాడు.. ఈ ఒక్క మాట చాలేమో మహేష్ ఏం సాధించాడో చెప్పడానికి.. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించిన మహేష్.. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన 'రాజకుమారుడు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. మొదటి సినిమాతోనే అమ్మాయిల కలల రాకుమారుడు అయ్యాడు.. ప్రేక్షకులకు ప్రిన్స్ గా పరిచయమైన మహేష్, సూపర్ స్టార్ గా ఎదగటానికి ఎక్కువ సమయం పట్టలేదు.. మురారి, ఒక్కడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను ఇలా ప్రతి సినిమాలో వైవిధ్యం చూపిస్తూ మెప్పించాడు.. ఇప్పటివరకు 24 సినిమాల్లో హీరోగా నటించిన మహేష్ ఎన్నో అవార్డులు అందుకున్నాడు, ఎన్నో రికార్డులు సృష్టించాడు.. త్వరలో తన 25 వ సినిమా మహర్షితో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.. ఈ రోజు మహేష్ జన్మదినం సందర్భంగా చిత్ర యూనిట్ మహర్షి ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ చేసింది.. మహేష్ లుక్ ప్రేక్షకులను ఫిదా చేస్తుంది.. టీజర్ లో మహేష్ చేతిలో లాప్ పట్టుకొని, హెయిర్ సరిచేసుకుంటూ స్లో మోషన్ లో నడుస్తుంటే.. బ్యాక్ గ్రౌండ్ లో దేవి శ్రీ అదిరిపోయే మ్యూజిక్.. ఇంకేం కావాలి.. టోటల్ గా మహేష్ ఫాన్స్ కి మంచి కిక్ ఇచ్చే గిఫ్ట్ అనాలి.