పూజాహెగ్గేను బందించిన మహేష్‌బాబు
on Feb 4, 2019
సినిమా అంటే అందమైన అబద్ధం! తెరపై జరిగేదంతా నిజమని నమ్మించడం నటీనటుల బాధ్యత. ఈ బాధ్యతను మహేష్ బాబు, పూజా హెగ్డే 100% చక్కగా నిర్వర్తించారు. వీరిద్దరూ జంటగా నటిస్తున్న సినిమా
మహర్షి. ఇందులో ఓ స్టిల్ నిన్న లీక్ అయింది. మహేష్ బాబును పూజ హెగ్డే గట్టిగా హత్తుకున్న ఈ స్టిల్ చూస్తుంటే నిజంగా ఇద్దరు ప్రేమికులు ఏమో అన్నట్లు ఉంది. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి... ఈ స్టిల్ లో మహేష్, పూజ ఇద్దరూ మహా ముద్దొస్తున్నారు. మహర్షి లో రిషి పాత్రలో మహేష్ నటిస్తుండగా... మహా పాత్రలో పూజా హెగ్డే నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా లో మెజారిటీ సీన్స్ షూటింగ్ చేశారు. గత నెలలో పొల్లాచిలో మహేష్ రైతుగా నటించిన సన్నివేశాలను తెరకెక్కించారు. హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ త్వరలో మొదలు కానుంది. మహేష్ ని హితుడు పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న విడుదల చేయనున్నారు. చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.