మహేష్ 25 వ సినిమా టైటిల్ అదిరిందిగా..!!
on Aug 7, 2018
మహేష్ బాబు బర్త్ డేకి ముందే అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ వచ్చింది.. మహేష్ తన 25 వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నారు.. అయితే వంశీ పైడిపల్లి సినిమా టైటిల్ ని రివీల్ చేసి అభిమానుల్లో జోష్ పెంచారు.. అయితే టైటిల్ ని వంశీ వినూత్నంగా విడుదల చేసారు.. సోషల్ మీడియాలో టైటిల్ కి సంబంధించిన ఒక్కో అక్షరాన్ని రివీల్ చేసారు.. ఇప్పటికే R, I, S అనే అక్షరాలను రివీల్ చేసిన వంశీ, తాజాగా H, I అనే అక్షరాలను రివీల్ చేసారు.. దీంతో మహేష్ 25 వ సినిమా టైటిల్ 'రిషి' అని అర్ధమవుతోంది.. కూల్ గా, క్యాచీగా ఉన్న రిషి టైటిల్ మహేష్ కు కరెక్ట్ గా సెట్ అవుతుందని అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.. మొత్తానికి మహేష్ 25 వ సినిమా టైటిల్ అదిరిపోయింది అంటున్నారు.