మణిలాగే మహతి కూడా ప్లస్ అవుతాడా?
on Nov 23, 2020
మంచు విష్ణుకి కథానాయకుడిగా తొలి విజయాన్ని అందించిన చిత్రం ఢీ. అప్పట్లో వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న శ్రీను వైట్ల రూపొందించిన ఈ సినిమా.. విష్ణులో సరికొత్త ఉత్తేజాన్ని నింపింది. ఆ తరువాత మళ్ళీ జట్టుకట్టని ఈ ఇద్దరు.. డి అండ్ డి (డబుల్ డోస్) కోసం మరోసారి కలసి పనిచేయనున్నారు. మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడయ్యింది. విష్ణునే స్వయంగా నిర్మించనున్న ఈ చిత్రానికి ఛలో, భీష్మ వంటి విజయాలతో ఊపు మీదున్న యువ సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ బాణీలను అందించనున్నాడు. అటు విష్ణుకి, ఇటు శ్రీను వైట్లకి మహతితో ఇదే మొదటి సినిమా కావడం విశేషం.
అయితే మహతి తండ్రి, స్వరబ్రహ్మ మణిశర్మ కాంబినేషన్ లో మాత్రం ఇద్దరికీ విజయాలున్నాయి. దుబాయ్ శీను కోసం శ్రీనువైట్ల.. దూసుకెళ్తా కోసం విష్ణు.. మణితో కలసి పనిచేశారు, సక్సెస్ చూశారు. మరి.. మహతి స్వర సాగర్ తోనూ ఆ సెంటిమెంట్ కంటిన్యూ అయి.. విష్ణు, శ్రీను వైట్ల మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాలి.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
