మహేష్ కత్తిని చెప్పుతో కొడతా..!!
on Jul 7, 2018
ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ కత్తి.. శ్రీరాముడు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల పట్ల హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో మహేష్ మీద కేసులు కూడా నమోదయ్యాయి.. జానారెడ్డి, నాగబాబు ఇలా పలువురు వ్యక్తులు మహేష్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.. తాజాగా సినీ నటి మాధవీలత, మహేష్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు.. రామాయణాన్ని కథగా భావిస్తే ఆయన వ్యక్తిగతం.. అంతేకాని పబ్లిక్‌గా మాట్లాడటం సరికాదు.. ఎన్నో తరాలు రామాయణాన్ని గౌరవిస్తూ వస్తుంటే ఇప్పుడు వీరు వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అని ప్రశ్నించిన ఆమె.. రావణుడితో సీత హ్యాపీగా ఉంటుందని చెప్పిన మహేష్ కత్తిని చెప్పుతో కొడుతాను.. వీడెవడు అలా చెప్పడానికి?.. వీడి జీవితమా?.. వాడి భార్య ఆయనను వదిలేసి వెళ్లింది.. వీడు ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో తెలుసు.. ఇలాంటి దుర్మార్గుడితో ఉండలేకనే ఆయన భార్య దూరంగా ఉంటుంది.. ఇలాంటి వ్యక్తి పురాణాలు, సీతమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారా? అంటూ మాధవీలత మండిపడ్డారు.