English | Telugu

MCA టీజర్ ఏ క్లాస్‌గా ఉందబ్బా!

on Nov 10, 2017

అన్నం అంతా పట్టుకొని చూడాలా? ఒక మెతుకు పట్టుకునే చూస్తే సరిపోదూ... అన్నం ఉడికిందో లేదో!  సినిమా అంతా చూడాలా? చిన్న టీజర్ చూస్తే సరిపోదూ... సినిమా అదిరిందో లేదో! నాని ‘ఎంసీఏ’ సినిమా టీజర్ నిజంగా ఆ రేంజ్ లోనే ఉంది. అసలు ‘ఎంసీఏ’ అంటే ఏంటి? క్వాలిషికేషనా? అడుగుతాడొకడు.  ‘ఎప్పుడైనా.. షర్ట్ బటన్ ఊడిపోతే... పిన్నీస్ పెట్టుకొని మేనేజ్ చేశావా? ఎప్పుడైనా మామూలు జీన్స్ ని బ్లేడ్ తో కట్ చేసి టోన్ జీన్ గా కలరింగ్ ఇచ్చావా? అతెందుకు ఇప్పుడైనా రోడ్ మీద వెళ్తూ బస్టాప్ లో నిలబడ్డ ఓ అందమైన అమ్మాయిని చూసి... ఇద్దరు ముగ్గురు పిల్లలతో ఫ్యామిలీ ఫోటో ఊహించుకున్నావా? ఇదే మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అంటే.

‘ఎంసీఏ’ అంటే..  ఆ మెండ్ సెట్ ఉన్న అబ్బాయ్ అని అర్థం. అందే.. మిడిల్  క్లాస్ అబ్బాయ్ అనర్థం.’ క్లారిఫికేషన్ ఇస్తాడు హీరో. అక్కడ టీజర్ ని కట్ చే్స్తే... ‘నువ్వు నాకు  నచ్చావ్... ఎప్పుడు పెళ్లి చేసుకుందాం’ అని అడిగే్స్తుంది బస్టాప్ లో నిలబడ్డ ఆ అమ్మాయ్. హీరోగారు షాక్. ఇక ‘ఎంసీఏ’ గా నాని ఎలా చేసుంటాడో.. బస్టాప్ లో నిలబడ్డ అందమైన అమ్మాయిగా సాయిపల్లవి ఏ స్థాయిలో కుర్రాళ్లను ఇబ్బందుల పాలు చేసుంటుందో ఊహించుకోండి. దీనికి తోడు దేవిశ్రీ నేపథ్య సంగీతం ఒకటి.. గిలిగింతలు పెట్టేస్తోంది. మొత్తంగా టీజర్ మాం...చి కలర్ ఫుల్ గా ఉందబ్బా. మరి సినిమా  ఎలా ఉంటుందో?

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here