ఇకపై ఆ సీన్స్‌కి దూరమంటున్న హీరోయిన్
on May 25, 2020
కాలగతిలో అనేక అనేక మార్పులకు తప్పకుండా కరోనా కారణం అవుతుందని చెప్పడానికి, ముఖ్యంగా సినిమాల్లో సన్నివేశాలు మారతాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇప్పట్లో హాట్ హాట్ బెడ్ రూమ్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ తీసే సాహసం ఎవరూ చేయకపోవచ్చు. ఒకవేళ రచయితలు అటువంటి సన్నివేశాలు రాసినా, అవి తీయడానికి దర్శకులు సిద్ధమైనా... నటీనటులు నో చెప్పవచ్చు.
ఒకప్పుడు రొమాంటిక్ సన్నివేశాల్లో నటించిన సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి ఇకపై అటువంటి సన్నివేశాలకు దూరమని స్పష్టం చేశారు. "ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రొమాంటిక్ సన్నివేశాలకు దూరంగా ఉండటమే మంచిదని అనుకుంటున్నాను. అయితే, సందీప్ కిషన్ సరసన నటిస్తున్న 'ఏ1 ఎక్స్ ప్రెస్'లో రొమాంటిక్ సీన్స్ ఇదివరకే షూటింగ్ చేశాం" అని లావణ్య త్రిపాఠి అన్నారు. దీన్నిబట్టి నీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కంటికి కనిపించని కరోనా ఏ పక్క నుంచి వచ్చి దాడి చేస్తుందో తెలియదు. తాకడం సంగతి పక్కన పెడితే... కరోనా సోకిన వాళ్లకు కొంత దూరంలో ఉన్న వచ్చే అవకాశం ఉందని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించే వారు బయటకు రావడానికి కూడా ఆలోచిస్తున్నారు. అటువంటిది సహ నటీనటులకు ముద్దులు ఇవ్వడం కౌగిలించుకోవడం వంటివి చేయడానికి ఆలోచించడం తప్పేమీ కాదు.
Lavanya Tripathi,Actress Lavanya Tripathi, lavanya tripathi a1 express,Lavanya Tripathi actress News